Thursday, December 31, 2009

Entha Kalam aagali ?

ఎంత  కాలం  ఆగాలి ,
ఎంత  దూరం  నడవాలి ,

  స్వచ్చమైన  నీటి  కోసం
  మాది  ఐన  నేల  కోసం

ఎంత  కాలం  ఆగాలి ,
ఎంత  దూరం  నడవాలి ,


  సమైక్యాంద్ర అని పళ్ళు ఇకిలించే వాళ్ళకు
  లేవు  కళ్ళు , మనసు  అంతా  కుళ్ళు  కుళ్ళు

ఎంత  కాలం  ఆగాలి
ఎంత  దూరం  నడవాలి

  తెలుగు  అంటె   తమదే  అంటూ
  మూడు  కోట్ల  నోటి  మాట  వొట్టి  అంటూ
  సినిమలండ్ల  జోకర్లు  విల్లన్లు  పనిమనుషులు  వీలే  అంటూ
  చూపించే   వీళ్ళ  తోటి
  కలసి  వుంటే  ఎట్లా  కలుగు  మేలు  మాకు

ఎంత  కాలం  ఆగాలి
ఎంత  దూరం  నడవాలి

  ఒక్క  మాట  మరచిపోకు
  తెలంగాణా   పది  జిల్లాల  గుండె   సప్పుడు
  దరువేస్తూ  కదిలితేయ్  మా  దండు
  ఏమవుతాదో  మీకు  తెలుసు