తెలంగాణ ఎందుకో
బతుకమ్మ పువ్వునడుగు
యాదగిరి గుట్టనడుగు
తెలంగాణ ఎందుకో
పాలమూరు పారెనడుగు
నిజామ్బాదు చెరుకునడుగు
తెలంగాణ ఎందుకో
ఉస్మానియా ఇటుకనడుగు
పాతబస్తీ ఇస్కూల్ నడగు
తెలంగాణ ఎందుకో\
కృష్ణమ్మా నీటి బొట్టునడుగు
నల్గొండల బావి బోర్లనడుగు
తెలంగాణ ఎందుకో
సిర్సిల్ల దారపోగ్గు నడుగు
పోచంపల్లి మగ్గాలనడుగు
తెలంగాణ ఎందుకో
సింగరేణి బొగ్గునడుగు
సిర్పూర్ కాగజ్నగర్నడుగు
తెలంగాణ ఎందుకో
ఓరుగల్లు కోటనడుగు
రంగారెడ్డి నేలనడుగు
తెలంగాణ ఎందుకో
సచివాలయం ఆఫీసర్ల కుర్చీలనడుగు
సీఎమ్ము పోస్టునడుగు
తెలంగాణ ఎందుకో
ఉడుకుతున్న మా రక్తాన్నడుగు
బిగుసుకుంటున్న మా పిడికిల్లనడుగు
Thursday, December 31, 2009
Subscribe to:
Post Comments (Atom)

3 comments:
lyrics r good post this to many telagana people who lives around the world
great :)
Superb Dude
Post a Comment