Wednesday, July 8, 2015

చినుకా చాలించు నీ అలక













చినుకా చాలించు నీ అలక
నీ సడి లేక  , నీ తడి చేరక
వాలిపోతుంది చేనులో మొలక
మూగబోయింది చెట్టు మీది చిలక

చినుకా చాలించు నీ అలక
ఎండెను ఆ వాగు వంక
వెక్కిరిస్తోంది తెల్లని ఇసుక
జాలి పడవా ఓ మబ్బు తునక

చినుకా చాలించు నీ అలక
చినుకా చాలించు నీ అలక