Thursday, August 1, 2013

seemandra udyamam

అట్టుడికిపోతుంది 
దోష మాడిపోతుంది 
చాయ్ మరిగిపోతుంది 
....... 
అని మారు మ్రోగే చాన్నెల్లకు 

ఆహుతి ఐన విద్యార్థులు 
దిగులు పడ్డ తల్లులు 
కాన రారు 


Thursday, January 24, 2013

Gandhi Partylo Gajinilu

గాంధీజీ  పార్టీ లో గజినీలు
నెలలో ఎన్ని రోజులో తెల్వదు
మానిఫెస్టోలో ఏముందో అస్సలు తెల్వదు
మంత్రులందరికి మతిమరుపు రోగం
దానికి అసలు కారణం మని మారకం


kaalam...paalu

విరిగే పాలను
కరిగే కాలాన్ని
                   ఆపలేవు...నిలుపలేవు
కుదిరితే
తియ్యని
            రసగుల్లా చేసుకో
            గత స్మృతులను నెమర వేసుకో 

Tuesday, January 22, 2013

ManuVaadi

మనువాది
----------

కదిలే మనుషులను తొక్కి
కదలని రాళ్ళను మొక్కే వాడు 

Time

తరాల తంత్రులపై 
మ్రోగే నిశబ్ద తరంగమే సమయం 

Sunday, January 13, 2013

Kadali

ఎ ఆర్ రెహ్మాన్ గారు  స్వరపరిచిన కడలి పాటలు విన్నాక నా మనసు చివుక్కు మంది, ఏంటి ఈ పాటలు అని ? అవి ఎంత సంగీత ప్రదానమైన  పాటలు అయినా ఆ పాటల పదాలకు అర్ధం ఉండాలిగా ? వనమాలి లాంటి రచయిత భాష ను మరి ఇలా అరవ పర్వం చెయ్యాలా ? వాళ్ళకంటే తెలుగు రాదు, ఎంత సేపు పదాల అమరిక సరిపోయి మాతృక లో ఉన్న ధ్వని వినిపిస్తే చాలు, కాని నిజంగా తెలుగు సాహిత్యాన్ని ఆస్వాదించే వాళ్ళు ఈ పాటలను వినగాలుగు తారా అని ఒక్కసారైనా మనసు పెట్టి వనమాలి గారు ఆలోచిస్తీ  బాగుండేది .

ఈ వరుసలో ఆలోచిస్తున్న నాకు తట్టిన ఒక గీతం ఇది, దీనికి ఎవరైనా పాశ్చాత్య భాణి కట్టగలరా ?

కన్నె కడలిగ  వస్తుంటే
కనులు రెండు చాలవు లే

గుండె లోతున ముల్లేదో
గుచ్చుకొని నను చంపేలే
ఇంత వరకు ఈ వయసు
అంత సొగసు ఎరుగదు లే


కన్నె కడలిగ  వస్తుంటే
కనులు రెండు చాలవు లే

మనసు అన్నది నాలోనే
కొత్తగా నేడు  పుట్టెను లే
వేడి గాలుల వేసవి లో
తను నవ్వితే మంచు బిందువు లే 

కన్నె కడలిగ  వస్తుంటే
కనులు రెండు చాలవు లే 

జనుల మధ్యన ఉన్నా  నే 
నాకు నేనే ఒంటరినే
ఊహకందని లోకంలో
రేయి పగలు గడిపితినే 

కన్నె కడలిగ  వస్తుంటే
కనులు రెండు చాలవు లే 

Saturday, January 12, 2013

Sankuraathiri

ఈ యంత్రాల నుండి ఈ రోజు నీవు  సెలవు తీసుకో
సంకురాతిరి సంబురాలను ఇంట్లో  నెలవు చేసుకో

ఆత్మీయులతో భోగి మంటల చుట్టూ చేరి
చల్లబడ్డ సంభందాలను వెచ్చగ చేసుకో

రంగుల జిగిబిగి తో ముగ్గులు గీయి
నీలో ఏ మూలో దాగిన కళాకారున్ని బైటికి తీయి

మూసుకు పోయిన నీ మనసును
పతంగులతో పైకి ఎగరేయి , ఆకాశమంత పరిచేయ్

నువ్వుల పాశం తీపి రుచిని తెలుసుకో
నవ్వుల తో నిండిన రోజును అందరితో పంచుకో


ఈ యంత్రాల నుండి ఈ రోజు నీవు  సెలవు తీసుకో
సంకురాతిరి సంబురాలను ఇంట్లో  నెలవు చేసుకో