హే శ్రీకృష్ణ పరమాత్మ
ఊపిరి సలపకున్నది
దశాబ్దాలుగా ఆకలి దప్పికలు తీరక డొక్క ఎన్దిపొఇనధి
ప్రాణములు పోవుచున్నవి
ఈ ధృతరాష్ట్ర కౌగిలి నుంచి విడిపించు
భీమ ఎందుకు తొందర , ఓపిక పట్టుము ఇదిగో నా షడ్పరిష్కారములు
1. యదా విదిగా ఉండుము , సొంపుగా ఉండును
2. నీ తలను బంధములోనే ఉంచి కాళ్ళు చేతులు నడుము విడిపించుకో
3. అంతగా అయితే కొంత అతని శిరోభారం మోస్తూ బయట పడుము
4. నీ తలను భుజములతో సహా బందం లోనే ఉంచి మిగతా శరీరము విదిపించెద
5. ఇంతగా ప్రాధేయ పడుచుంటివి కనుక విదిపించెద కాని బయట చలి బాగా ఉన్నది మరియు ధృతరాష్ట్రుడు ఒప్పుకొనవలె .
6. అన్నిటికన్నా యోగ్యమైనది నీవు అతని కౌగిలి లోనే ఉండుట , అతని నుంచి నీకు రక్షణగా ఒక జౌళి వస్త్రం బహుకరించెద.
గమనిక : ధృతరాష్ట్రుడు అనగా స్వార్ధపూరిత సీమంధ్ర రాజకీయ నాయకులూ మరియు పెట్టుబడిదారులు మాత్రమే కాని ప్రజలు కాదు .
Thursday, January 6, 2011
Subscribe to:
Post Comments (Atom)

2 comments:
Agree with you. They could not give a proper solution. In fact proper solution is 5th option.
Good comparision. I liked the PS.
Post a Comment