Tuesday, August 30, 2016

నేటి జీవితం

నేటి జీవితం

గమ్యం ఎరుగని పయనం
ఆగని సాగర మధనం

ఏదో అమృతం కోసం
రొజూ విష పానం

అంతర్జాలం లో అత్యుత్సాహం అంతర్లీనంగా ధుఖం
సకలం ధనదోషం
కానరాని సంతోషం

వ్యక్తిత్వం లో నపుంసకత్వం


ఆగని ఆశల ఆరాటం

ఆగని ఆశల ఆరాటం
సగటు మనిషిదీ చిత్రపటం
అడుగు అడుగునా పొరాటం
ముందుకు సాగని మొండిఘటం

Thursday, August 25, 2016

నాలొ నేను

నాలొ నేను

నాలో నేను
దాక్కున్నాను
ఎన్నొ పొరల మధ్యన
ఒక్కో పొరకు ఒక్కో వాసన

కనిపించె నేను
కనిపించని నేను
మధ్యన ఎంతో వేదన

Monday, July 4, 2016

Parayi Desham

పరాయి దేశం
కిరాయి వేషం
మనసు లోన ఏకాంతం
మని కోసమే పంతం
కాజాలదు ఇది సొంతం
తెలుసుకో ఈ సత్యం
తెలియని తీరం వైపు పయనం
చిక్కిచుకుంది నిను ఈ వలయం