Thursday, September 18, 2014

dagulbaji

అనగనగ ఓ డ్రామోజి
వీడి బ్రదరు ఓ డబ్బాజి
వీళ్ళ పెద్దన్న యెల్లొజి
అంతా కలిసి చేసేది దగుల్బాజి 

Thelisi Theliyani Vayasu

తెలిసి తెలియని వయసు
ఎదిగి ఎదగని మనసు
రంగుల లోకం రమ్మంటే
అటుగా వెళ్ళింది
తళుక్కు మనే తారల నడుమ
మిణుగురులా వెలిగింది
అంతలోనె అమావాస్య వచ్చింది

తెలిసి తెలియని వయసు
ఎదిగి ఎదగని మనసు
బడా బడా  చేతులు ఏవో
ఆ వెలుగును గుప్పిట బందిచి
తమ చీకటి కోర్కెలు తీర్చుకొంటుంటే
దూరంగా ఉన్న డేగ కళ్ళు
ఒక్కసారి వాలి
ఆ చేతులను దాచేసి
పాపం ఆ మిణుగురును
లోకం ముందర
పురుగును చేసాయి


Monday, June 2, 2014

Jai Telanganam

చీకటిని చేదించిన కాంతి కిరణం
ఆకాశమంతా గులాభి వర్ణం
వెలుగెత్తిన కాకతీయ తోరణం
గలమెతిన్న నాలుగు కోట్ల జనం
జై తెలంగాణం జై జై తెలంగాణం 

Monday, April 28, 2014

Gaali

పవన్ అంటే గాలి
ఉట్టి గాలి కాదు
 నిలకడ లేని గాలి
ఇయ్యాల ఒక్క తాన ఉంటె
రేపట్కి ఇంకో తాన
దీన్ని గాలి దుమారం అని
కూడా అంటరు
ఈ గాలి దుమారం ఊళ్ళ ఉన్న
చెత్త అంత ఎత్కొచ్చి మన వాకిట్ల పడేస్తది
ఈడు గూడ అట్లనే ఉన్నడు

Thursday, January 23, 2014

Devadasu Malli Puttali

పగలు మోసపోయింది
పగలంతా ఆటలాడి ఆ తారను
రేయికి అప్పగించింది
తొంబై వసంతాల ఆ తార వెలుగును
చూసి సహించని చీకటి
నెమ్మదిగా తన ఒడిలో కలుపుకుంది
ఆ బహుదూరపు 'బాటసారి' ని తెలియని
తీరానికి  పంపింది

'సువర్ణ సుందరి' పిలిచిందో
'మహా కవి కాళిదాసు' 'మేఘ సందేశం' ఏమైనా పంపాడో
ఈ 'గోవుల గోపన్న' అందరికి ఆత్మీయుడు
'మరో ప్రపంచం' నిర్మించాలని
ఆ దేవుడే ఈ 'అమరశిల్పి జక్కన్న' ను పిలిచాడేమో
'కీలు గుర్రం' ఎక్కి
నిశి వేళలో వెళ్ళిపోయాడు

'అంతస్తులు' ఎన్ని ఉన్న
'ఆత్మీయులు' ముఖ్యమని
చెప్పిన 'అమర జీవి'
ఈ 'దసరా బుల్లోడు'

'పునర్జన్మ' అన్నది నిజమైతే
ఈ 'దేవదాసు' మల్లీ పుట్టాలని
ఆశిద్దాం
ఈ 'పూల రంగడి' సినీపూలు
మరువ లేనివి


- Hari
అక్కినేని నటన లో అక్కినేని కనిపించడు  కేవలం పాత్ర తప్ప 

Sunday, January 12, 2014

గమ్యం లేని గమనం ఎందుకు

చలనం కలగని సహనం ఎందుకు
గమ్యం లేని గమనం ఎందుకు

మరణం లేని జననం ఉండదు
అరుణం లేని ఉదయం ఉండదు

తరుణం కొరకై ఆగకు రా 
'భ్రమ'ణం నుంచి బైటికి రా 

కణ కణము చేతనమై 
క్షణ క్షణము మధనం చేయ్ 

ప్రణమిల్లును ప్రపంచం 
జననం అవ్వును సార్ధకం 



Friday, January 3, 2014

ఆయి ఆయి ఆయీ

ఆయి  ఆయి ఆయీ
ఆయి  ఆయి ఆయీ
బజ్జోరా బుజ్జాయి

ఆయి  ఆయి ఆయీ
ఆయి  ఆయి ఆయీ
బజ్జోరా బుజ్జాయి

చల్లని వెన్నెల రేయి
నీ కురులే నిమిరాయి

ఆయి  ఆయి ఆయీ
ఆయి  ఆయి ఆయీ

ఎన్ని నోముల ఫలమోయి
పండంటి మా పాపాయి
బజ్జోరా బుజ్జాయి


బోసి నవ్వులు విసిరేయి
నాన్నగారి మిట్టాయి
బజ్జోరా బుజ్జాయి

ఆయి  ఆయి ఆయీ
ఆయి  ఆయి ఆయీ
బజ్జోరా బుజ్జాయి
బజ్జోరా బుజ్జాయి
బజ్జోరా బుజ్జాయి 

ఓ రోరి కిరణం సమైక్యాంద్రకు నువు ఆఖరి చరణం

చీఫ్ మినిస్టర్ అని అనుకుంటే
చీపు లిక్కర్ తాగావు
మంత్రదండం నాదంటూ
చీపురు పుల్లను ఊపావు

ఎందుకురా పరేషాను 

నల్ల మరకల నీ బ్రైను
తెల్లగ చేసే రిన్ను
తెలంగాణా మన్ను

లేదుర నీకు నైతికత
నీ భాషలో తెలుగెంత
చల్ల కొచ్చి దాచకు ముంత
ఎందుకో తెలియదా నీ సమైక్యత

ఈ  తరుణం
అంతా తెలంగాణం
ఓ రోరి కిరణం
సమైక్యాంద్రకు నువు ఆఖరి చరణం