Wednesday, December 12, 2012

Akhila Paksham

గూటికి రెండు పక్షులను 
పిలిచిన అఖిల పక్షం 
ఎవరి పక్షం వహిస్తుందో 
తెలియని అక్కుపక్షులు ఎవరు ?

ధన పక్షపాతంతో 
ద్విపక్ష వాదన చేస్తున్న 
హస్తిన లోని హస్తానికి 
పక్షవాతం వచ్చే రోజు దగ్గరలో వుంది .

Monday, October 8, 2012

Maa Alludu Very Gooddu

మా అల్లుడు వెర్రీ గుడ్డు
వాని ఆస్తులు మఱ్ఱి పళ్ళు
నోరు విప్పితే వెఱ్రి జను
ల, పీకేస్తం ఇంకో తొఱ్ఱి పన్ను  

Tuesday, August 14, 2012

Idi Svathantrama ?

పిల్లవాడి పాల డబ్బా నుండి
ముడ్డి గుడ్డ వరకు విదేశీ సరుకే
                                            || ఇది స్వతంత్రమా ||
ఇంట్లో టీవీ సేరియళ్ళు
బయట సెల్లు ఫోన్ సొల్లు
                                            || ఇది స్వతంత్రమా ||
పల్లెలో కుల వ్రుత్హులకు చెదలు
కూలీ  కై నగరానికి వలసలు
                                            || ఇది స్వతంత్రమా ||
ప్రభుత్వ కళాశాలలకు బూజు
కార్పోరేట్ కాలేజీ పై మోజు
                                            || ఇది స్వతంత్రమా ||
జలుబు జరనికి CT స్కాన్లు
30 ఏళ్ళకే BP , షుగర్లు
                                            || ఇది స్వతంత్రమా ||
మేధస్సు అమెరికాకు ఎగుమతి
ఐఫోన్ ఐపాడ్ ల దిగుమతి
                                            || ఇది స్వతంత్రమా ||
పరిశోదనలో మాత్రమే  పేరిణి శివ తాండవాలు
ప్రదర్శనలో మాత్రం బ్రేఅకులు డిస్కోలు
                                            || ఇది స్వతంత్రమా ||
ప్రాంతీయ సినిమాకు ఇంగ్లీష్ పేర్లు
పాటల్లో వెస్టర్న్ వాయిద్యాల హోరు
                                            || ఇది స్వతంత్రమా ||
అల్లం ఎల్లి పాయ పేస్టు , మసాల పౌడెర్
సూపర్ మార్కెట్లో నే కొనుదురు
                                            || ఇది స్వతంత్రమా ||
LED టీవీ, లేటెస్ట్ ఫోను, కారు కిస్తుల్లో కొను
పదో తారీఖునే ఖాళీ జేబు ఆపై క్రెడిట్ కార్డు గీకు
                                            || ఇది స్వతంత్రమా ||


Tuesday, July 24, 2012

Kotalo Rani

ఆమె ఒక కోటలో రాణి 
ఏనాడు వినిపించదు తన వాణి
తెలంగాణా గురించి సై అనదు, నై అనదు
గట్టిగా అడిగితే 'మనసున వున్నది చెప్పాలని వున్నది మాటలు రావే అలా' అంటుంది 
పోనీ ఈ పాట ఐన తన గొంతు తో పాడుతుందా అంటే అదీ కాదు 
అంతా ఆమె కొంగు పట్టుకొని తిరిగే గల్లీ గాళ్ళ తో అనిపిస్తుంది 

ఈమె అధికార మెట్లు ఎక్కడానికి ఎన్ని మెట్లైన దిగుతుంది
తన హంగు కాపాడుకోడానికి
సినీ  రంగు వెలసి రాజకీయ రంగు పులుముకొని
సామాజిక తెలంగాణా అంటూ వచ్చి 
భంగ పడిన వాడికి 'చెయ్యి' అందిస్తుంది  
తెలంగాణా కు చెయ్యి ఇస్తుంది 



Mahanetha Illali Deeksha

చేనేత ఫై
మహా నేత సతికి 
ఎంత ప్రేమ 
పతి బతికున్నప్పుడు, ఈ
మతి ఏమైనది ?
ఆపతి లో ఉన్న
నీతి, గతి లేని
సుతుని పరపతి కై
మగ్గాలతో పగ్గాలు పొందాలని
వడుకుతుంది నూలు