Monday, October 10, 2011

Tribute to Jagjit Singh Jee - The Ghazal King of India

अभी मेरे  बचपन  के  लम्हें  कई तुम्हारी  ग़ज़ल  में  मुझे  जीने  ही थे 
रूटे  हुए  मेरे  यार  को  तुम्हारे  ही  नगमो  से  सजाना  ही  था 
अभी  ज़िन्दगी  के  कई  राज़ों  को  तुम्हारे  हारमोनियम  के  चाबी  से  खुलना  ही  था 
दुनिया  के  कडवी  बातो  में  तुम्हारे  शहद-ए-आवाज़  में  डुबो  के  पीना  ही  था 

मगर  इतने  ही  में  ठुम  हमसे  रूट  गए  - जग  जीत  गए 

abhi mere bachpan ke lamhe kae thumhari ghazal mein muje jeene the
roote hue mere yaar ko thumhare hi nagmo se sajaanaa hi tha
abhi zindagi ke kai raaazo ko thumhare harmonium key chaabi se khulnaa hi tha
duniya ke kadvi baato mein thumhare shahad-e-awaaz mein dubo ke pina hi tha

magar ithne hi mein thum hamse root gaye - Jag Jeet Gaye

Wednesday, September 21, 2011

1 Re Kg Rice

రూపాయి కే కిలో బియ్యమంట మరి ఆ కిలో బియ్యం ఎట్లా వండాలో ధేన్తోటి తినాల్నో కూడా సర్కారు వారు సెలవిస్తే 


చింతాపండు చిన్నబోయే 
కంది పప్పు కంది పాయె
టాటా ఉప్పు టాటా చెప్పె
రూపాయి కే కిలో బియ్యము నే ఎట్లా తినేది 

ఉల్లి గడ్డ ఉరికి పాయె
ఎల్లి పాయె యెల్లి పాయె
ఆలు గడ్డ అలిగి పాయె 
రూపాయి కే కిలో బియ్యము నే ఎట్లా తినేది 

మంచీ నూనె ముర్కాయే 
పామైలు గడ్డ కట్టె
డాల్డా ఏమో బరువాయె 
రూపాయి కే కిలో బియ్యము నే ఎట్లా తినేది 

కిరసనైలు కర్సాయే 
గ్యాసేమో గ్యాసాయే 
కరెంటేమో నిలువదాయే 
రూపాయి కే కిలో బియ్యము నే ఎట్లా తినేది 

Thursday, January 6, 2011

Dhrtharashtra Kougili - SriKrishna Rakshana

హే శ్రీకృష్ణ  పరమాత్మ
  ఊపిరి  సలపకున్నది
  దశాబ్దాలుగా  ఆకలి  దప్పికలు  తీరక  డొక్క  ఎన్దిపొఇనధి
  ప్రాణములు  పోవుచున్నవి
  ఈ ధృతరాష్ట్ర  కౌగిలి  నుంచి  విడిపించు
 
భీమ  ఎందుకు  తొందర , ఓపిక  పట్టుము  ఇదిగో  నా  షడ్పరిష్కారములు
 1. యదా  విదిగా  ఉండుము , సొంపుగా  ఉండును
 2. నీ  తలను  బంధములోనే   ఉంచి  కాళ్ళు  చేతులు  నడుము  విడిపించుకో
 3. అంతగా  అయితే  కొంత  అతని  శిరోభారం  మోస్తూ  బయట  పడుము
 4. నీ  తలను  భుజములతో  సహా  బందం  లోనే  ఉంచి  మిగతా  శరీరము  విదిపించెద
 5. ఇంతగా  ప్రాధేయ  పడుచుంటివి  కనుక  విదిపించెద  కాని  బయట  చలి  బాగా  ఉన్నది  మరియు  ధృతరాష్ట్రుడు  ఒప్పుకొనవలె .
 6. అన్నిటికన్నా  యోగ్యమైనది  నీవు  అతని  కౌగిలి  లోనే  ఉండుట , అతని  నుంచి  నీకు  రక్షణగా  ఒక  జౌళి  వస్త్రం  బహుకరించెద.

 గమనిక  : ధృతరాష్ట్రుడు  అనగా  స్వార్ధపూరిత  సీమంధ్ర  రాజకీయ  నాయకులూ  మరియు  పెట్టుబడిదారులు  మాత్రమే కాని  ప్రజలు  కాదు .

Monday, January 3, 2011

Raktha Charitham

కత్తులతో సావాసం
బ్రతుకంతా మారణహోమం
కనిపించదు కారుణ్యం
ఆలోచనంతా అరణ్యం

విధిగా చేరినా
విధి లేక వచ్చినా
అందరిది ఒకటే సూత్రం
చిందిచాలని రక్తం

పచ్చని బతుకులు భస్మం
ఇది మండుతున్న రావణ కాష్టం
తర తరాలుగా తడి ఆరని కళ్ళు
శోకంతో విలపించే ఆలి, తల్లి, చెల్లెలు

రవి, శీను , సూరి
రక్త చరితకు సిరగా మారి
చెబుతున్నారీ మాట
ఇది అంతం కాని ఆట